![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -68 లో......సంక్రాతి ఉత్సవాలలో పోటీలు జరుగుతాయి. అందులో ధీరజ్ పై విశ్వ రౌడీలతో ఎటక్ చేపిస్తాడు. అది ఫెయిల్ అయి రామరాజు కుటుంబం గెలుస్తుంది. భద్రవతి కుటుంబం ఓడిపోతుంది. అది అవమానంగా ఫీల్ అవుతాడు విశ్వ. అసలు ఈ ధీరజ్ గాడు ఎలా బ్రతికాడని విశ్వ అనుకుంటాడు. అప్పుడే ధీరజ్ వచ్చి ఓడిపోయామని భాదపడుతున్నావా.. చాకచక్యంగా ఉండాలి.. అప్పుడే గెలుస్తామని ధీరజ్ అంటాడు.
నువ్వు నాకు హ్యాపీ సంక్రాతి చెప్పావ్ కదా.. నేను కూడా చెప్పాలి కదా హ్యాపీ సంక్రాతి బామ్మర్ది అని ధీరజ్ చెప్పి వెళ్ళిపోతాడు. రౌడీలని విశ్వ కలిసి ఫెయిల్ చేశారంటూ కోప్పడతాడు. ఒకవైపు పూజ జరుగుతుంటే మరొకవైపు పక్కకి వెళ్లి ప్రేమ బాధపడుతుంది. ఏంటి ఇక్కడ ఉన్నావ్.. రా పిలుస్తున్నారని ధీరజ్ పిలుస్తాడు. నేను రాను నిన్ను పెళ్లి చేసుకున్నానని మా వాళ్ళు బాధపడుతున్నారని ప్రేమ అనగామ. మా నాన్న కుడా బాధపడుతున్నాడని ధీరజ్ చెప్తాడు.
గుడిలో పూజ జరుగుతుంటే పూజారి రామరాజుని హారతి ఇవ్వమంటే.. వాడికి ఏం విలువ ఉందని ఇవ్వమంటున్నావ్.. వాడు లేచిపోయి పెళ్లి చేసుకున్నాడు.. వాడి కొడుకులు అంతే అని భద్రవతి అవమానంగా మాట్లాడుతుంది. మా నాన్న నాకు ఘనంగా పెళ్లి చేస్తాడని చందు అంటాడు. పెద్దోడ్ని వదిలిపెట్టి చిన్నోళ్లు పెళ్లి చేసుకున్నారంటూ భద్రవతి కోప్పడుతుంటే.. ఆపండి అంటూ వేదవతి గట్టిగా అరుస్తుంది. తరువాయి భాగంలో రౌడీలతో ధీరజ్ ని చంపేయండి అంటూ రౌడీలతో విశ్వ మాట్లాడడం ప్రేమ వింటుంది. ధీరజ్ ని కొట్టి విశ్వ కత్తితో పొడవబోతుంటే ప్రేమ వెళ్లి ఆపుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |